schedule Thursday, September 03, 2026

గుండెపోటుకు చెక్‌...!

calendar_today October 20, 2024
person dharshininews
గుండెపోటుకు చెక్‌...!
గుండెపోటుకు చెక్‌...! - ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం దూరం - అందరికి తెలిసిన సేప్టీ ట్రిక్స్ ఇవే దర్శిని డెస్క్ : గుండె పోటు ప్రస్తుత జీవన విధానంలో యువత నుంచి పెద్దల వరకు ఆందోళన కలిగించే అంశం. ఇటీవల అధికమవుతున్న గుండెపోటు మరణాలు అందరిని బాధిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ.. జిమ్ చేస్తూ.. నడుచుకుంటూ వెళుతున్న వారు గుండెపోటుకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మనకు తెలిసిన కొన్ని చిట్కా వల్ల గుండెపోటు మరణాలను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రిక్స్‌ పాటించి సేఫ్‌గా ఉండాలని సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. అనారోగ్యకరమైన ఆహారం, శారీర శ్రమ లేకపోవడం ఇవన్నీ కూడా గుండెపోటుకు కారణంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కార్డియాలజిస్టుల ప్రకారం.. చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒకసారి ఉపవాసం లేదా రోజుకు ఒకసారి తినడం మంచిది. ధూమపానం, పొగాకుకు దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.. ఒత్తిడి లేకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలి.. అంతేకాకుండా రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో చౌకగా లభించే ఫాస్ట్ ఫుడ్ పిల్లలు, పెద్దలకు హానికరం. గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలను నివారించడానికి సమతుల్య, సాధారణ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం... ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. మంచి నిద్ర గుండె జబ్బులను నివారిస్తుంది. నిద్రలేమి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండెను సురక్షితంగా ఉంచుకోవడానికి 6 నుంచి 8 గంటల నిద్ర - క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, శారీరక శ్రమ మంచిదంటున్నారు. గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి జీవనశైలి మార్పులు తప్పనిసరి. తినడం, నిద్రపోవడం.. మేల్కొనే సమయం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలను పాటిస్తే కొంత వరకు మన గుండె సేఫ్‌గా ఉన్నట్లే. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29890/