schedule Tuesday, July 07, 2026

ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..!

calendar_today October 21, 2024
person dharshininews
ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..!
ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..! - ఆయన కొత్త పార్టీ కార్యాచరణకు పూర్తి మద్దతు - మర్యాదపూర్వకంగా కలసిన తాండూరు బీసీ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తామని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ లు హైదరాబాద్ లో ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య అన్నివర్గాల ప్రజాభిప్రాయ సేకరణతో త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారని చెప్పారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఇంకా నాలుగేళ్లు అవకాశం ఉన్నా కూడా ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేశారని అన్నారు. ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తామని, ఆయన త్వరలో ఏర్పాటు చేసే బీసీ రాజకీయ పార్టీ పటిష్ఠతకు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సమావేశాలను జయప్రదం చేసేందుకు కృషి చె స్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29928/