schedule Tuesday, July 07, 2026

మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత

calendar_today October 23, 2024
person dharshininews
మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత
మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత - అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సాయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ (చంద్రశేఖర్ గౌడ్) చేయూత అందించారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన నాగారం వెంకట్ రాములు(బుడ్డన్న) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఆర్సీ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతుని అంత్యక్రియల కోసం రూ. 5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందుకు కుటుంబ సభ్యులు ఆర్సీ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ఆర్సీగౌడ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29960/