schedule Tuesday, July 07, 2026

పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి

calendar_today October 26, 2024
person dharshininews
పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి
పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి - కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి - ఓపెన్ హౌస్‌లో విద్యార్థులకు వివరణ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు పోలీసు విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం కరణ్ కోట్ పోలీస్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. గౌతాపూర్లోని మారుతీ స్కూల్కు చెందిన విద్యార్థులు కరణ్ కోట్ పోలీస్టేషన్ను సందర్శించారు. పోలీస్టేషన్ లో కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రిసెప్షన్, కోర్టు డ్యూటీ, స్టేషన్ రైటర్, సెక్షన్ ఇంచార్జ్, బీసీ, పెట్రో కార్, లాకప్, ఆయుధాల నిర్వహణ వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోలీసుల విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30033/