schedule Tuesday, July 07, 2026

విలువైన సేవ..!

calendar_today October 27, 2024
person dharshininews
విలువైన సేవ..!
విలువైన సేవ..! - పోలీసు కుటుంబాలకు చేయూత అభినందనీయం - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - ఐవీఎఫ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు, సరుకుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎండనక, వాన అనక రోజంతా పనిచేసే పోలీసు ఉద్యోగులు, హోం గార్డుల కుటుంబానికి చేయూత అందించడం అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేష్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సమక్షంలో గత యేడాది నుంచి ఇప్పటి వరకు మరణించిన పోలీసు ఉద్యోగులు, హోంగార్డుల కుటుంబాలకు చేయూత అందించారు. అదేవిధంగా దాతల సహాకారంతో మరో 40 మందికి దుస్తువులు, సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ రంగంలో పోలీసు ఉద్యోగుల పట్ల ఓ చిన్నచూపు ఉంటుందన్నారు. అంతేకాకుండా విధి నిర్వహణలో మరణించే వారి సంఖ్యలో పోలీసు శాఖలో ఉంటుందన్నారు. అలాంటి పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు చేయూత అందించాలని ముందుకు వచ్చి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్ చంద్ర పండిత్, తాండూరు అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, సభ్యులు వీర ప్రసాద్, అసద్, లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ సభ్యులు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30042/