schedule Sunday, September 06, 2026

మీరే కాపాడాలి సార్..!

calendar_today October 27, 2024
person dharshininews
మీరే కాపాడాలి సార్..!
మీరే కాపాడాలి సార్..! - ఎమ్మెల్యే వద్దకు ఆర్ఎంపీ డాక్టర్లు - సమస్యలు వివరించి పరిష్కరించాలని వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్ఎంపీ వైద్యులపై ఒత్తిడిలు, వేధింపులు జరగకుండా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. ఆదివారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరులోని ఆర్ఎంపీ వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూరు నియోజకవర్గాలలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు చేపట్టారని వివరించారు. అన్ని అర్హతలు కలిగి క్లీనిక్‌లు నడిపించుకుంటున్నామని, కొందరి వల్ల ఆర్ఎంపీ వైద్యులపై ప్రభావం పడుతుందని అన్నారు. అధికారులు, ప్రభుత్వం నుంచి అర్హులైన ఆర్ఎంపీ వైద్యులకు ఒత్తిడిలు, వేధింపులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. నిబంధనల ప్రకారం.. ఆర్ఎంపీ వైద్యులకు తగిన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డా.సంపత్ కుమార్, ఆర్ఎంపీ వైద్యులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30048/