schedule Tuesday, July 07, 2026

పాడు పనికి పండిన పాపం..!

calendar_today October 28, 2024
person dharshininews
పాడు పనికి పండిన పాపం..!
పాడు పనికి పండిన పాపం..! - బాలికతో అద్యాపకుడి అసభ్యత్వ ప్రవర్తన - ఆగ్రహించిన రాజకీయ, యువజన సంఘాలు - లెక్చరర్‌ను సస్పెండ్‌ చేయాలని దర్నా - ఉద్రిక్తంగా మారిన కాలేజీ వాతావరణం - విద్యార్థిని ఫిర్యాదుతో నిందితుడిపై కేసు - వివరాలు వెల్లడించిన పెద్దేముల్ ఎస్ఐ గిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు కాలేజీ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై రాజకీయ, యువజన సంఘాల నాయకులు దర్నా నిర్వహించారు. అద్యాపకుని సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దర్నా ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈసంఘటన సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హింది లెక్చరర్‌గా పనిచేస్తున్న జమీల్ అనే అద్యాపకుడు గత రెండు రోజుల క్రితం కాలేజీలో చదువున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థిని కాలేజీకి రావడం లేదని ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్, ప్రిన్సిపల్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొమ్ము రజితలు వేరు వేరుగా కళాశాలను సందర్శించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, నాయకులు సందీప్, ఏబీవీపీ నాయకులు నర్సింలు తదితరులు కాలేజీలో దర్నా నిర్వహించారు. అసభ్యంగా ప్రవర్తించిన హింది లెక్చరర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో పాటు అధికారులతో వాగ్వివాదం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ గిరి సిబ్బందితో కలిసి కాలేజీకి చేరుకున్నారు. ఉద్రిక్తతల మద్య నిందితుడైన అద్యాపకుని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అద్యాపకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్ఐ గిరి వెల్లడించారు. మరోవైపు విద్యార్థినికి న్యాయం జరిగేలా చూడాలని నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30069/