schedule Friday, September 11, 2026

తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు

calendar_today October 28, 2024
person dharshininews
తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు
తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు - బీఎసీ వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన శివాకుమార్ అనే యువకుడికి డా.బీఆర్ అంబెద్కర్ నేషనల్ అవార్డు దక్కింది. బహుజన సాహిత్య అకాడమి(బీఎస్ఏ) వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ అవార్డును అందజేశారు. నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా శివకుమార్ ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన గొంతుకులై సమాజంలో వివక్ష ధోరణిపై గొంతెత్తి వినిపించడం, మహనీయుల ఆలోచన విధాన్ని ప్రచారం చేయడంతో పాటు వారి జయంతులను ఘనంగా నిర్వహిస్తున్న బహుజన మేథస్సులను గుర్తించి అంబేద్కర్ నేషనల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారని శివకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు పొందడంపై హర్షం వ్యక్తం చె స్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30079/