schedule Tuesday, July 07, 2026

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!

calendar_today October 30, 2024
person dharshininews
కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!
కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..! - ఉత్సహాంగా పండగ సంబరాలు - ఆకట్టుకున్న విద్యార్థుల నాటక ప్రదర్శన - మతాబుల వెలుగుల్లో కేరింతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ఆవరణలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్)లో బుధవారం దీపావళీ జోష్ నిండింది. పండగను పురస్కరించుకుని స్కూల్లో ఉత్సహాంగా సంబరాలను జరుపుకున్నారు. సంబరాలలో భాగంగా విద్యార్థులు నరకాసుర వధ నాటక ప్రదర్శనను నిర్వహించారు. వేషాధారణలతో.. హావ భావాలతో నాటక ప్రదర్శన రంజింపజేసింది. అదేవిధంగా నరకాసుర దహన కార్యక్రమం కూడా ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు కాకర పువ్వొత్తులు, మతాబులు వెలిగిస్తూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల దశ నుంచే పండగల సంప్రదాయాలను తెలియజేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్, యజమాన్యం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30235/