schedule Tuesday, July 07, 2026

భవిష్యరెడ్డికి అభినందనల వెల్లువ

calendar_today November 2, 2024
person dharshininews
భవిష్యరెడ్డికి అభినందనల వెల్లువ
భవిష్యరెడ్డికి అభినందనల వెల్లువ - సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ - పలువురు క్రీడాకారుల అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన క్రికెటర్ భవిష్యరెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అకాడమి (హెచ్సీఏ) బీసీసీఐ అండర్ -15 వి భాగంలోని రాష్ట్ర క్రికెట్ జట్టుకు వికారాబాద్ జిల్లా నుంచి భవిష్య రెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్ భవిష్య రెడ్డిని ఘనంగా సన్మానించారు. భవిష్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తొ డ్పాటు అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కేశవులు, చారి, ప్రతాప్, రాం ప్రసాద్, శ్రీవర్ధన్, పవన్, ఓంకార్, విషాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30284/