schedule Tuesday, July 07, 2026

ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..!

calendar_today November 2, 2024
person dharshininews
ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..!
ఖోఖో వీరులు.. గౌతమి విద్యార్థులు..! - ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలో ప్రతిభ - అభినందించిన కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలో తాండూరులోని గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం హైదరాబాద్ సరూర్ నగర్ లోని స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-17 ఖోఖో పోటీలో పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనిల్ రాథోడ్, చందు యాదవ్ లు పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచి ఈనెల 2వ వారంలో నిర్వహించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ సంగారెడ్డి, ప్రిన్సిపల్ కోండారెడ్డి విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా పీఈటీ గఫ్పార్, ఉపాధ్యాయులు అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30281/