schedule Friday, September 11, 2026

పూల్ సింగ్‌కు నివాళులు..!

calendar_today November 3, 2024
person dharshininews
పూల్ సింగ్‌కు నివాళులు..!
పూల్ సింగ్‌కు నివాళులు..! - అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం పాషాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పూల్ సింగ్‌కు పలువురు నివాళులు అర్పించారు. ఆదివారం పూల్‌ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆ గ్రామానికి వెళ్లి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో సీనియర్ నేతలు కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ మాజీ చెర్మన్ మాధవ రెడ్డి, మారేపల్లి గోపాల్ రెడ్డి, ఇందూర్ ప్రకాష్, తాండూరు మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రాంచందర్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30281/