schedule Thursday, September 03, 2026

యాలకులు ఆరోగ్యానికి మేలు..!

calendar_today November 4, 2024
person dharshininews
యాలకులు ఆరోగ్యానికి మేలు..!
యాలకులు ఆరోగ్యానికి మేలు..! - రోజూ రెండు తింటే బీపీ, షుగర్‌ పరార్ - సహజ పద్దతిలో రోగాలను తరిమే ఔషదాలు దర్శిని డెస్క్ : వంటింట్లో ఉండే యాలకులు ఆహారానికే కాదు.. ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి. వీటిలో ఉన్న ఔషదగుణాలు సహజ పద్దతిలో రోగాలను దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏలకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. అందువల్ల, వీటిని తీసుకుంటే మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజూ రెండు ఏలకులు తినాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట. రోజుకు రెండు యాలకులు తింటే బీపీ, షుగర్‌ పరార్ కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఏలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శాకాహారం లేదా మాంసాహారంలో ఏలకులను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏలకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది ముఖం నుంచి టాక్సిన్స్ తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఏలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30143/