schedule Sunday, September 06, 2026

ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..!

calendar_today November 5, 2024
person dharshininews
ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..!
ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..! - సాహు శ్రీలత ఇంట్లో వినూత్న వేడుక తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా పుట్టిన రోజు బేకరీ కేకులు, చాక్లెట్‌, ఐస్‌క్రీం కేకులను కట్‌ చేసి బర్త్‌డే చేసుకుంటారు. ఇంకొందరు ఇంట్లోనే కేక్‌ తయారు చేసి కట్‌ చేసుకున్నారు. అవన్నీ పిండి, ఇతర వస్తువులతో తయారు చేసినవే. తాండూరు పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ నివాసంలో వారి కూతురు పుట్టిన రోజు వేడుకలను వేరైటీగా జరుపుకున్నారు. వారి కూతురు సాహితి జన్మదినం సందర్భంగా ఇంట్లోనే పండ్లతో కేక్‌ను(ఫ్రూట్‌ కేక్) తయారు చేసి వేడుక చేసుకున్నారు. ఈ కేక్ తయారికి కర్బూజ, సంత్ర, ద్రాక్ష, కీవి తదితర పండ్లను ఉపయోగించి వినూత్నంగా తయారు చేశారు. అందంగా తయారు చేసిన కేక్‌ను కూతురు సాహితీ చేత కట్ చేయించి సంబరంగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు వేడుకకు వచ్చిన అతిథులు ఫ్రూట్‌ కేక్‌ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30382/