schedule Tuesday, July 07, 2026

ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్..!

calendar_today November 13, 2024
person dharshininews
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్..!
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్..! - రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు - ఇబ్బందులు పడ్డ వాహనదారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్‌ రోడ్డు మార్గం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బుదవారం ఉదయం ఈ మార్గంలో వెళులున్న ఓ లారీ బ్రిడ్జిపై పంక్చర్ కావడంతో అక్కడికక్కడే మొరాయించింది. రోడ్డుగా అడ్డంగా స్థంభించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ కొన నుంచి... ఈ కొన వరకు సందులేకుండా ఒక్కసారిగా వాహానాలు దిగ్భందమయ్యాయి. ఎటు వెళ్లలేక.. ముందుకు సాగలేక తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30534/