schedule Tuesday, July 07, 2026

గోశాలలో కార్తీక దీపోత్సవం

calendar_today November 16, 2024
person dharshininews
గోశాలలో కార్తీక దీపోత్సవం
గోశాలలో కార్తీక దీపోత్సవం - ఏర్పాట్లు చేసిన గోశాల సేవా సమితి - భారీ సంఖ్యలో్ తరలిరావాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని గోశాల కార్తీక దీపోత్సవంకు ముస్తాబవుతోంది.రేపు ఆదివారం గోశాలలో గోపూజతో పాటు కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5-01గంటలకు గోపూజ, కార్తీక దీపోత్సవంకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గోభక్తులు, గోసేవకులు, హిందూబందువులందరు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్, గోశాల సేవా సమితి అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి, కార్యదర్శి కోట్రిక కిరణ్‌ కుమార్‌లు విజ్ఞఫ్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30571/