schedule Saturday, July 04, 2026

గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..!

calendar_today November 17, 2024
person dharshininews
గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..!
గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..! - భారీగా గైర్హాజరు అయిన అభ్యర్థులు - హాజరు శాతంను వెల్లడించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరిగిన గ్రూప్-3 పరీక్షలకు సగానికి పైగా అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పేపర్లలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. 11 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3215 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం జరిగిన పరీక్షకు 1802 మంది గైర్హాజరుతో 1413 మంది పరీక్షలు రాయగా.. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1799 మంది గైర్హాజరుతో 1416మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. దీంతో తాండూరులో మొదటి రోజు నిర్వహించిన పరీక్షకు 44 శాతం మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇందులో కొందరు ఆలస్యంగా పరీక్షకు దూరం కాగ, మరికొంత మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేక పోయారని అధికారులు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30582/