schedule Tuesday, July 07, 2026

నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం

calendar_today November 17, 2024
person dharshininews
నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం
నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం - తాండూరు గోశాలలో ఆధ్యాత్మీక శోభ - భారీగా తరలివచ్చిన భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని గోశాలలో కార్తీక దీపోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. కార్తీక మాసంను పురస్కరించుకుని గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గోభక్తులు, సేవకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై గోపూజ చేసుకున్నారు. అనంతరం మహా శివుడు, ఓంకారం, గోమాతల అలంకరణలో వేసిన రంగవళ్లులలో కార్తీక దీపాలను వెలగించారు. ఈ సందర్బంగా పలువురి వక్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కార్తీక దీపోత్సవంతో గోశాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు, గోశాల సేవా సమితి సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30588/