schedule Thursday, September 03, 2026

చలి.. అంత మంచిదికాదు..!

calendar_today November 18, 2024
person dharshininews
చలి.. అంత మంచిదికాదు..!
చలి.. అంత మంచిదికాదు..! - చిన్నారులు, వృద్దులు జాగ్రత్త - నియమాలు పాటిస్తే రక్షణ దర్శిని డెస్క్ : గజగజ వణికించే చలి కాలంలో అందరూ జాగ్రత్త ఉండక తప్పుదు. ఎందుకంటే చలి కాలంలోని చలి.. పోగ మంచు.. ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీ వోపీడీ, అలర్జీ, బ్రంకైటిస్‌, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రంగా ఉన్న సమయంలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. శ్వాసకోశ, ఈఎన్‌టీ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసి కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం పూర్తిగా కప్పేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవద్దు. గొంతునొప్పి ఉన్నవారు రోజూ రెండు సార్లు వేడిచేసిన నీటిలో కొంచెం ఉప్పువేసి పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా ఐదారు సార్లు చేయాలి. బయటి నీరు, ఆహారం తీసుకోవద్దు. ఫ్రిజ్‌ నీళ్లు అసలు తాగొద్దు. వేడి ఆహారమే తీసుకోవాలి. వీటితో శక్తిని పెంచుకోండి.. అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీ రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అందుకు అవసరమైన ఫుడ్ తీసుకునేలా మీ డైట్ తీర్చిదిద్దుకోవాలి. కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఉండే మాంసాహారం, గింజ ధాన్యాలు మీరు శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతాయి. నువ్వులు, కొర్రలు, బెల్లం, మెంతి కూర వంటివి చలి నుంచి కాపాడుతాయి. రాత్రి పూట వరి అన్నానికి బదులుగా గోధుమ పిండి రొట్టెలు, లేదా కొర్రల అన్నం మీ శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. ఉసిరి కాయ మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. పాటించాల్సిన జాగ్రత్తలు.. పొగమంచు బారిన పడకుండా ఉండాలంటే ఉదయం వేళల్లో మాస్కులు ధరించాలి. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలి. మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు శరీరంపై దద్దుర్లు రాకుండా చూసుకోవాలి. శరీరం పొడిబారకుండా తడిగా ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ను వేయించుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. బాగా వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు. వాహనాలు నడిపే వారు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొగతాగే వారికి దగ్గరగా వెళ్లకూడదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30567/