schedule Tuesday, July 07, 2026

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం..!

calendar_today November 19, 2024
person dharshininews
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం..!
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం..! - 78 ఏండ్లయినా బీసీలకు దక్కని వాట - దేశంలో కులగణనతో హక్కుల సాధన - బీసీల సమరభేరిని జయప్రదం చేయాలి - బీసీ సంఘం జాతీయకార్యవర్గ సభ్యులు కే. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడమే ముందున్న లక్ష్యమని, అందుకు బీసీలంతా ఏకమై ఉద్యమించాల్సిన అవసరముందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో బీసీల సమరభేరీ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను తాండూరులో ఆవిష్కరించారు. మంగళవారం పట్టణంలోని హిమాలయ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని అన్నారు. ఏండ్లుగా బీసీలు కనిపించని దోపిడీ వివక్ష అనుచువేతకు గురవుతున్నారన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలు పైగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించారని గుర్తుచేశారు. ఇప్పుడు బీసీలు రాజ్యాధికారం సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న బీసీల సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సోషల్ మీడియా ఇన్చార్జి బస్వరాజ్, తాండూర్ మండల అధ్యక్షుడు బసంత్ కుమార్, యాలల మండల అధ్యక్షుడు లక్ష్మణ్ చారి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్, పెద్దేములు మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, టైలర్ రమేష్, రాము ముదిరాజ్, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు కొండాపూర్ అనిత, అంతారం అనిత, తస్లీన్ బేగం, తాండ్ర నరేష్, పరమేష్, జంటపల్లి వెంకట్, శివకుమార్, నర్సింలు, రమేష్, ఆరేకటిక సమాజం నాయకులు సురేష్, టీర్ఎస్వి నాయకులు దత్తు, రాజక సంఘం అధ్యక్షుడు గోపాల్, కుమ్మరి సంఘం నాయకుడు శంకర్, లింగయత్ సమాజ నాయకులు కోటం సిద్ద లింగం, గౌడ సంఘం నాయకులు బాబా గౌడ్, క్షత్రియ సమాజం నాయకులు అజిత్ ఠాకూర్, సమాజం నాయకులు బాలాజీ ఠాకూర్, బీసీయువ నాయకులు మంతటి రాజు, రామ్ రెడ్డి, రాజ శేఖర్, నర్సింలు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30603/