schedule Friday, September 11, 2026

గుంతలో పడి తల్లడిల్లీ...!

calendar_today November 20, 2024
person dharshininews
గుంతలో పడి తల్లడిల్లీ...!
గుంతలో పడి తల్లడిల్లీ...! - గంట పాటు గోమాత గోస - తవ్వకంపై గ్రామస్తుల మండిపాటు - గోనూరు గేటు వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిర్లక్ష్యంగా తవ్వి వదిలేసిన గుంతలో ఓ ఆవు పడి.. గంట పాటు తల్లడిల్లింది. ఆవును బయటకు తీసేందుకు గ్రామస్తులు శ్రమించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తాండూరు మండలం గోనూరు గేటు వద్ద చోటు చేసుకుంది. రైతు మాల మాణిక్యప్ప ఆవులను పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి గోనూరు గేటు వద్ద ఆవులను కట్టేసి ఉండగా ప్రమాద వశాత్తు సమీపంలో ఎయిర్ టెల్ కోసం తవ్వి వదిలేసిన గుంతలో పడిపోయింది. ఇరుకైన గుంతలో పడి తల్లడిల్లి పోయింది. గమనించిన రైతు యజమాని గ్రామస్తుల సహాకారంతో గుంతలో పడిన ఆవును బటయకు తీశారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవేటు కంపెనీ కోసం గోతులు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోతులపై చర్యలు తీసుకుని.. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా చూడాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30639/