schedule Saturday, July 04, 2026

కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..!

calendar_today November 21, 2024
person dharshininews
కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..!
కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..! - రోజు రోజు పెరుగుతున్న చలితో జాగ్రత్త - సూచనలు జారీ చేసిన తెలంగాణ హెల్త్ అడ్వైజరీ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : రోజు రోజుకు చలి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ చలి నుంచి ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించింది. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా.. చిన్నారులు, వృద్దులు, ప్రజలు జాగ్రత్తక ఉండక తప్పదని తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ తెలిపింది. ఈ చలి పంజా నుంచి తప్పించుకునేందుకు పలు జాగ్రత్తలు సూచించింది. – గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. – జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. – తీవ్రమైన చలితో హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలి.. – చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటి చేయవద్దని హెచ్చరించింది. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య ముప్పు వస్తుందని తెలిపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30651/