schedule Wednesday, July 08, 2026

శభాష్.. ధీరజ్..!

calendar_today November 26, 2024
person dharshininews
శభాష్.. ధీరజ్..!
శభాష్.. ధీరజ్..! - చిన్న వయస్సులోనే గీతపై భక్తి అభినందనీయం - సన్మానించిన కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. ధీరజ్ అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య యువ భక్తున్ని అభినందించారు. తాండూరు గీతా సత్సంగ్ సమితికి చెందిన నర్సింలు మనుమడు ధీరజ్ చిన్న వయస్సులోనే భగవద్గీత పఠనం, గీతా గానామృతంపై పట్టు సాధించాడు. ఇటీవల భక్తిటీవీ నిర్వహించిన గీతా గానామృతంలో ధీరజ్ పాల్గొని నిర్వహకులను, భక్తులను మైమరిపించాడు. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ ధీరజ్ ను ఘనంగా సత్కరించారు. చిన్న వయస్సుల్లోనే భక్తిభావం అలవర్చుకోవడం అభినందనీయమని శుభా సీస్సులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, సభ్యులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30836/