schedule Saturday, July 04, 2026

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం

calendar_today November 27, 2024
person dharshininews
బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం - న్యాయ విజ్ఞాన సదస్సులో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : బాల్య వివాహాలు చేయడం చట్టరిత్య నేరమని తాండూరు మండల లీగల్ సర్వీస్ కమిటి సభ్యులు తెలిపారు. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలలో లీగల్ సర్వీస్ కమిటి ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. అమ్మాయిలకు 18ఏండ్లు, అబ్బాయిలకు 21 ఏండ్లు నిండిన తరువాతనే పెండ్లిళ్లు చేయాలన్నారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్టరిత్యా నేరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల న్యాయవాదులు జిలానీ, మస్తాన్, లీగల్ సర్వీస్ కమిటి ప్రతినిధి ప్రేమ్ కుమార్, స్కూల్ హెచ్ఎం శరత్కళ, పూర్వ విద్యార్థుల కమిటి ప్రతినిధి లింగదళి రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30902/