schedule Tuesday, July 07, 2026

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

calendar_today December 2, 2024
person dharshininews
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత - మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ - వార్డులో ప్రజాపాలన విజయోత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం వార్డులో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్‌ కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు. విజయోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పారిశుధ్ధ్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ చంద్రకళ, వార్డు ఇంచార్జ్ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31096/