schedule Thursday, September 03, 2026

అంటుడు కాయలో అద్భుతాలు..!

calendar_today December 3, 2024
person dharshininews
అంటుడు కాయలో అద్భుతాలు..!
అంటుడు కాయలో అద్భుతాలు..! - శరీరంలో అవయవాలకు పోషకాలు - కిడ్నీ రోగాలకు చక్కని ఔషధం దర్శిని డెస్క్ : లక్షలు ఖర్చు చేసినా నయం కాని రోగాలు ఆయుర్వేదం ద్వారా లభించే మొక్కల వల్ల ఊరట చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఆయుర్వేధ మొక్కలను ఎన్నో చూస్తుంటాం. కొందరు ఇండ్లలోనే నాటి పలు రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పబోయే అంటుడు కాయ గురించి తెలుసుకుందాం. దీనిని అటిక మామిడి తీగ అని కూడా పిలుస్తారు. అంటుడు కాయ ఆకులు, పువ్వులు, రెమ్మలు శరీరంలోని కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది మంచి సొల్యూషన్ అంటుంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా దీన్ని వాడితే.. మీ కిడ్నీల సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయట. కిడ్నీలు డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి కాపాడిందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని మిగిలిన ఆకు కూరల్లాగానే వండుకుని తినవచ్చట. దీని జ్యూస్ తయారీ విధానం ఇలా అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి. 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి. మరిగే క్రమంలోనే అందులో ఆ ముక్కలను వేయలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే సరిపోతుంది. ఈరసాన్ని ఎవరు తాగొచ్చు? ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నవాళ్లు.. సమస్యలు వస్తాయనుకునేవాళ్లు.. ఎవరైనా తాగొచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకునేవాళ్లు, కిడ్నీ సమస్యల కోసం ఇంగ్లీష్ మందులు వాడేవాళ్లు కూడా వాడొచ్చు. అటిక మామిడి ఆకులను ఇంగ్లీష్ కిడ్నీ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. అంతటి ఔషధ గుణాలు ఉన్న అటిక మామిడితో సింపుల్ గా కిడ్నీ సమస్యలను రూపుమాపుకోవచ్చు. నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31122/