schedule Saturday, July 04, 2026

అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..!

calendar_today December 7, 2024
person dharshininews
అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..!
అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..! - చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు - హైదరాబాద్‌ హయాత్‌ నగర్‌లో ఘటన  హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఆపదలో బాధితులను ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. అంబులెన్స్‌తో అతివేగంగా దూసుకెళ్లి భీభత్సం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే సినిమా స్టైల్లో వెంబడించి దొంగను పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హయత్‌నగర్‌ లో 108 వాహనాన్నిఓ దొంగ చోరీ చేసి పరారయ్యాడు. అంబులెన్స్‌ సైరన్‌ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈసీన్ సినిమాలో చేజింగ్ లా కనిపింది. చిట్యాల వద్ద పట్టుకునేందుకు యత్నించగా.. ఓ వ్యక్తిని ఢీకొట్టి కేతేపల్లి మండలం వైపు వెళ్లాడు. ఈ మార్గంలో కోర్లపహాడ్‌ టోల్‌గేట్‌ వద్ద గేట్‌ను ఢీకొట్టి వేగంగా ముందుకెళ్లాడు. చివరకు పోలీసులు టేకుమట్ల వద్ద రోడ్డుపై అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్నారు. మరోవైపు అంబులెన్స్‌ ఢీకొట్టిన ఘటనలో జాన్‌రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అంబులెన్స్ ఎత్తుకెళ్లిన నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. https://www.facebook.com/khanyahiya276/videos/1620412002014743 ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31291/