schedule Saturday, September 12, 2026

10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి

calendar_today December 7, 2024
person dharshininews
10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి
10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి - ఆర్ కృష్ణయ్య పిలుపుతో నిరసన - బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 10న తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం చేపడుతున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌ కుమార్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలు ముట్టడి చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కాలర్షిప్ లని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూరులోని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకుల పాఠశాలల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిని బీసీ సంఘం నాయకులు, అనుబంధ సంఘాల నేతలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞఫ్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31295/