schedule Saturday, July 04, 2026

కన్న కొడుకుపై క్రూరత్వం..!

calendar_today December 9, 2024
person dharshininews
కన్న కొడుకుపై క్రూరత్వం..!
కన్న కొడుకుపై క్రూరత్వం..! - కత్తితో దాడి చేసి చంపేయత్నం - వదిలి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని ఘాతుకం - అరుపులు విని కాపాడిన గ్రామస్తులు - కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కంటికి రెప్పలా కాడాల్సిన తండ్రే కన్న కొడుకు పట్ల క్రూరత్వం ప్రదర్శించాడు. కొడుకును చంపితే తనను వదిలి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని కత్తి(చాకు)తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కేడ్ హన్మంతు భార్య, ముగ్గుర పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. హన్మంతు భార్యతో తరుచూ గొడవలు పడుతుండె వాడు. ఇది భరించలేక రెండు నెలల క్రితం భార్య బందువుల ఇంటింటికి వెళ్లి పోయింది. పెద్ద కుమారుడు కుమారుడు అరవిందు(14) తండ్రి హన్మంతు వద్దే ఉంటున్నాడు. అయితే హన్మంతు తన కుమారుడు అరవిందును చంపితే వదిలి వెళ్లి పోయిన భార్య తిరిగి తన వద్దకు వస్తుందని ఉద్దేశంతో కత్తి(చాకు) తీసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అరవిందు చేతులపై, మెడపై దాడి చేశారు. బాలుడు అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి హన్మంతు నుంచి విడిపించారు. అరవిందును తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. సోమవారం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రి హన్మంతుపై కేసు నమోదు చె యడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/31320/