ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..!
December 17, 2024
dharshininews
ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..!
- పొట్ట గుట్టను కరిగించే ఔషధాలు
- వికారం, కడుపునొప్పి నుంచి ఉపశమనం
దర్శిని డెస్క్ : ఉదయాన్నే నిద్ర లేవగానే అందరికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ మద్య రకరకాల టీ లను తాగడం కొత్త సంప్రదాయంగా మారింది. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నోటికి రుచిని అందించడతో పాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగటం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. పుదీనా టీతో ఈజీగా బరువు తగ్గుతారు. చక్కెర వేసి తయారు చేసిన టీ, కాఫీలు తాగే బదులు క్యాలరీలు లేని పిప్పరమెంటు టీ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయి.
శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.పుదీనా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి దీని వల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలెర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల నుండి విడుదలయ్యే సహజ మెంథాల్ నూనె ఆవిరి.. తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ముఖ, చర్మ సౌందర్యానికి కూడా దోహదపడుతుంది. పిప్పరమింట్ టీ సాధారణంగా ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేనిది. కానీ, కొంతమందికి కడుపు నొప్పి, గుండెల్లో మంట, విరేచనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం పుదీనా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్ , మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/31514/