schedule Thursday, September 03, 2026

నల్ల ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు..!

calendar_today December 19, 2024
person dharshininews
నల్ల ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు..!
నల్ల ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు..! - రక్తంలో కొలెస్ట్రాల్‌ రాకుండా ప్రభావం - క్యాన్సర్‌తో పోరాడే పోషకాలు - మెమోరి పెరిగేందుకు ఉపయోగం దర్శిని ప్రతినిధి : నల్ల ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా సీజనల్‌ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ద్రాక్షను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శీతాకాలంలో తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి దోహద పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్షలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. నల్లద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మేలు చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.అంతేకాదు..నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మానసిక కార్యకలాపాలను నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. యవ్వనంగా కనిపించేందుకు దోహదం చేస్తుంది. నల్ల ద్రాక్షలో సీ-విటమిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల చలి కాలం ప్రతి రోజు ఈ ద్రాక్షను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్షలో సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి, నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకుంటే.. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది. ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31546/