schedule Friday, September 11, 2026

ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..!

calendar_today December 23, 2024
person dharshininews
ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..!
ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..! - ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో రంగోలీ పోటీ - మొదటి విజేతలకు నగదు బహుమతి - జయప్రదం చేయాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్త యేడాది రాకముందే తాండూరు ఆర్యవైశ్య మహిళ సంఘం రంగోటీ పోటీలకు శ్రీకారం చుట్టుంది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంపీటేషన్‌లకు శ్రీకారం చుట్టింది. తాండూరులో అందరికన్న ముందు ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభలు తెలిపారు. వచ్చే ఆదివారం 29వ తేదిన పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో రంగోలీ కాంపీటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రంగోలీ పోటీలో ఉత్సహవంతులు పాల్గొనవచ్చన్నారు. పోటీలో గెలిచిన మొదటి విజేతకు రూ. 5వేలు, రెండో విజేతకు రూ. 3వేలు, మూడో విజేతకు రూ. 2వేలతో పాటు మరో 5 మందికి ప్రోత్సహాక బహుమతులు ఉంటాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కోసం  సెల్ : 9059550450, 9642363631లకు సంప్రదించవచ్చన్నారు. పోటీలు పాల్గొనే వారికి నిబంధనలు ఉంటాయని తెలిపారు. ఒక గంట పాటు సమయం ఉంటుందని, సహాయం కోసం ఒకిరిని తీసుకోవచ్చని, చేతితోనే ముగ్గులు వేయాల్సి ఉంటుందని, ఎలాంటి వస్తవులు లేకుండా ఎలాంటి ముగ్గు అయినా వేయొచ్చని తెలిపారు. ఈ పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కాంపీటేషన్‌ను సక్సెస్ చేయాలని విజ్ఙప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31630/