schedule Thursday, September 03, 2026

రాష్ట్రంలో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ల బ‌దిలీలు

calendar_today October 29, 2021
person dharshininews
రాష్ట్రంలో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ల బ‌దిలీలు
రాష్ట్రంలో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ల బ‌దిలీలు - ప‌లువురు క‌మీష‌న‌ర్ల‌కు స్థాన చ‌ల‌నం హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలోని పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలో పలువురు పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురిని బదిలీ చేయగా.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిప‌ల్ కమిషనర్లను బదిలీ చేసింది. బదిలీ అయిన వారి వివరాలలోకి వెళితే... జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ శంకరయ్యను నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్‌గా బదిలీ చేశారు. వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామకృష్ణను ఫిర్జాదిగూడ మునిసిపల్ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రవీందర్ సాగర్‌ను మిర్యాలగూడ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ మహమూద్ యూసుఫ్‌ను ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బ‌దీలీ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులలో పేర్కొన్నారు. 15 మంది మున్సిపల్ కమిషనర్ల బ‌దిలీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శంకరయ్య మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నాగేశ్వర్ పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా రామకృష్ణ రావు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా రవిందర్ సాగర్ నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా సత్యనారాయణ రెడ్డి గద్వాల్ మున్సిపల్ కమిషనర్ గా జానకి రామ్ సాగర్ షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా జయంత్ కుమార్ రెడ్డి ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ గా అమరేందర్ రెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా లావణ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ గా యూసుఫ్ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా సఫిల్లా తుర్కంజల్ మున్సిపల్ కమిషనర్ గా జ్యోతి జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జ్యోతిరెడ్డి మణికొండ మున్సిపల్ కమిషనర్ గా ఫల్గున్ కుమార్