schedule Monday, July 06, 2026

భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్

calendar_today January 1, 2025
person dharshininews
భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్
భద్రేశ్వరుని సేవలో రాజుగౌడ్ - కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు - దేవుని సన్నిధిలో అందరికి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి సేవలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తరించారు. బుధవారం కుటుంబంతో కలిసి భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో భద్రేశ్వరునితో పాటు శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికి కలిసి రావాలని, అంతా మంచే జరగాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, కౌన్సిలర్ లత సింధు గౌడ్, నాయకులు ఎర్రం శ్రీధర్, రాజు గౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31893/