schedule Monday, July 06, 2026

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం

calendar_today January 1, 2025
person dharshininews
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదాం - కేటీఆర్ ను కలిసిన అఫ్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా కృషి చేయాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించినట్లు ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో కేటీఆర్ ను అప్పూ(నయూం) మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా కార్యాచణకు సిద్దం కావాలని చెప్పినట్లు అఫ్పూ తెలిపారు. కేటీఆర్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు డా. మెతుకు ఆనంద్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల నాయకత్వంలో గులాబీ జెండా ఎగురవె స్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31897/