schedule Monday, July 06, 2026

వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..!

calendar_today January 2, 2025
person dharshininews
వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..!
వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..! - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - సొంత వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని అన్ని వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అన్నారు. గురువారం తన సొంత వార్డు 27వలోని వాసవీ కాలనీలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరిగిందన్నారు. తన వార్డులోని ప్రజల విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో పాటు వార్డులోని రోడ్లతో పాటు మురుగు కాలువలు, విద్యుత్ దీపాలు, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతామన్నారు. మరోవైపు కాలనీ వాసులు మాట్లాడుతూ వార్డు సమస్యలను చైర్ పర్సన్‌కు వివరించడం జరిగిందన్నారు. ఇందుకు స్పందించి ముందుగా సీసీ రోడ్డు వేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం పెద్దలు రాజలింగం, శ్రీదర్, నరేందర్, రమేష్‌, రఘు, మణిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31935/