schedule Saturday, July 04, 2026

ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!

calendar_today January 8, 2025
person dharshininews
ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!
ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..! - పది, ఇంటర్‌ అర్హత చాలు - సొంత జిల్లాలో పనిచేసుకునేందుకు అవకాశం దర్శిని డెస్క్ : దేశంలోని సామన్య పౌరులతో పాటు వృద్ధులు, చిన్నారులందరికి ఆధార్ కార్డు అవసరం. అందరికి ఆధార్ కార్డు నమోదు సేవలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుంచి తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆధార్ సేవా కేంద్రాలలో పనిచేసేందుకు గాను ఆధార్ ఆపరేటర్, ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. పై అర్హతల తో పాటు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్. పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏ జిల్లాలలో ఖాళీలు వున్నాయో ఆ జిల్లాకు చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ మరియు రెస్యూమ్ లను అప్లోడ్ చేయవలసి వుంటుంది. తెలంగాణా అభ్యర్థులు తేది: 28/02/2025 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణా లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: అదిలాబాద్ – 01 కరీంనగర్ – 01 భద్రాద్రి కొత్తగూడెం – 01 మహబూబాబాద్ – 01 మహబూబ్ నగర్ – 01 మెదక్ – 01 మూలుగు – 01 నల్గొండ – 01 నారాయణ పేట – 01 నిర్మల్ – 01 నిజామాబాద్ – 01 పెద్ద పల్లి – 01 రంగా రెడ్డి – 01 వికారాబాద్ – 01 వనపర్తి – 01 యాదాద్రి భువనగిరి – 01 దరఖాస్తుల కోసం కింద లింకులను ఓపెన్ చేయండి.. https://cscspv.in/ask-job.html https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32072/