గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్ చేస్తాం..!
January 9, 2025
dharshininews
గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్ చేస్తాం..!
- దిల్ రాజ్ వాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్
- క్షమాపణలు చెప్పాలని రాజుగౌడ్ డిమాండ్
- తాండూరులో చిత్రప్రదర్శనను అట్టుకుంటామని హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మూవీ గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్ చేస్తామని తాండూరు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు, బిడ్డలు కల్లు తాగుతారు.. మటన్‌లు తింటారు తప్పా.. మూవీలు చూడరని అవమాన పరిచారని అన్నారు.
ఈ కారణంగా శుక్రవారం విడుదలకు సిద్దమైన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న గేమ్ చేంజర్ మూవీని తాండూరులో బాయ్‌కాట్ చేస్తామన్నారు. చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మూవీని అడ్డుకుంటారని అన్నారు. నిర్మాత దిల్ రాజు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
వీడియో కింద ఉంది...
[video width="848" height="766" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2025/01/VID-20250109-WA1107.mp4"][/video]
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/32153/