schedule Friday, September 11, 2026

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే..!

calendar_today January 10, 2025
person dharshininews
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే..!
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే..! - కుటుంబ సభ్యులతో దర్శించుకున్న మనోహర్ రెడ్డి - వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తరించారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32163/