schedule Tuesday, July 07, 2026

కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!

calendar_today January 10, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!
కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..! - ఉత్సహంగా పండగ సంబరాలు - రంగవల్లులు, హరిదాసుల కోలాహలం - ఆకట్టుకున్న డూడూ బసవణ్ణల ప్రదర్శన - అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లి మహారాజ్ దేవాలయ వద్ద ఉన్న క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) లో సంక్రాంతి జోష్ నిండుకుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శుక్రవారం స్కూల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ స్కూల్ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పండగలో కనిపించే హరిదారులు, బసవణ్ణలు, భోగి మండలు, సంక్రాంతి గొబ్బెలతో ప్రదర్శలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండగ సందర్భంగా పాఠశాలల ఆవరణలో విద్యార్థులు, టీచర్లు అందమైన రంగవల్లులను తిర్చిదిద్దారు. https://youtu.be/0Yt_sOjORzE విద్యార్థినిలు, మహిళ ఉపాధ్యాయులు సంక్రాంతి బొడ్డెమ్మల ఆట పాటలతో సందడి చేశారు. రంగవల్లులతో పాటు హరిదాసుల పాటలతో కొలాహలం ఏర్పడింది. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, డూడూ బసవణ్ణల ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న చిన్నారి విద్యార్థులకు వారి తల్లులు భోగిపండ్లు వేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు, టీచర్లు జరుపుకున్న సంబరాలపై ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, యాజమాన్యం సభ్యులు అభినందించారు. సంక్రాంతి తెలుగు సంప్రదాయ పండగ అని, దాని విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చదువుతో పాటు విద్యార్థులకు పండగల, సంప్రదాయాల విలువలను అందించడం కేవీసీఎస్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32178/