schedule Friday, September 11, 2026

రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..!

calendar_today January 11, 2025
person dharshininews
రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..!
రేపు తాండూరులో రన్ ఫర్ యూత్..! - హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ఆదివారం తాండూరులో రన్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తాండూరు హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి రన్ ఫర్ యూత్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా, వినాయక చౌరస్తా మీదుగా శాంత్ మహాల్ సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్దకు చె రుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరవుతారని చెప్పారు. రాజకీయ నేతలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/32189/