schedule Saturday, July 04, 2026

తాండూరులో చైనా మాంజా విక్రయాలు

calendar_today January 11, 2025
person dharshininews
తాండూరులో చైనా మాంజా విక్రయాలు
తాండూరులో చైనా మాంజా విక్రయాలు - రూ. 6,400ల మాంజా స్వాదీనం - విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు...? తాండూరు, దర్శిని ప్రతినిధి : నిషేధిత చైనా మాంజాపై టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో మాంజా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సచిన్ అనే వ్యక్తి షాపులో చైనా మాంజాను గుర్తించారు. దీని విలువ రూ. 6వేల 400లు ఉంటుందని అంచనా వేశారు. విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విక్రయాలపై పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32205/