schedule Saturday, September 05, 2026

ఆనందంగా ఆట విడుపు..!

calendar_today January 13, 2025
person dharshininews
ఆనందంగా ఆట విడుపు..!
ఆనందంగా ఆట విడుపు..! - గాలి పటాలు ఎగురవేసిన డీఎస్పీ - పాల్గొన్న ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతిభద్రతలు, అసాంఘీక కార్యక్రమాలను అరికట్టడంలో నిత్యం పనిచేసే పోలీసులు సోమవారం ఆట విడుపు పొందారు. భోగీ పండగ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలి పటాలు ఎగురవేశారు. పట్టణంలోని విలియమూన్ స్కూల్ మైదానంలో పోలీసులు సందడి చేశారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు సబ్ డివిజన్లోని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ శంకర్ తో పాటు వివిధ పోలీస్టేషన్ అధికారులు, సిబ్బంది గాలి పటాలు ఎగురవేశారు. ఉత్సహాంగా గాలి పటాలు ఎగురవేస్తూ కల్లాస్.. లూటీ.. అంటూ కేకలు వేస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడతూ సంస్కృతి సంప్రదాయమైన సంక్రాంతి పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండగ పూట ఎలాంటి విషాధాలు జరగకుండా పిల్లలపై దృష్టిసారించాలని సూచించారు. సబ్ డివి జన్ లోని పోలీసు అధికారులు, సిబ్బందికి, ప్రజలకు పండగ శుభకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32243/