schedule Friday, September 11, 2026

చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు

calendar_today January 13, 2025
person dharshininews
చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు
చిలుకవాగు కల్వర్టులోకి దూసుకెళ్లిన బైకు - అదుపుతప్పి పడిపోయిన యువకులు - వ్యక్తిని, బైకును బయటకు తీసిన స్థానికలు - తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : బైకు అదుపు తప్పడంతో దానితో పాటు ఓ యువకుడు వాగు కల్వర్టులోకి దూసుకెళ్లాడు. ఈ సంఘటన తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం నుంచి కోడంగల్ వైపు ఓ యువకుడు బైకుపై వెళుతున్నాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న జాతీయ రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జీ సమీపంలోని చిలుక వాగు కల్వర్టు పనులు చేస్తున్నారు. అయితే బైకుపై వెళుతున్న యువకుడు కల్వర్టు వద్ద ఎలాంటి బారికేడ్లు లేకపోవడంతో అదుపుతప్పి బైకుతో పాటు వాగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే యువకున్ని, బైకును బయటకు తీశారు. యువకునికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కల్వర్టు పనులు చేపడుతున్న అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. పనుల వల్ల ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కల్వర్టు వద్ద జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32246/