schedule Monday, July 06, 2026

ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి

calendar_today January 13, 2025
person dharshininews
ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి
ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు అభివృద్ధి - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్ అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 11వ వార్డులో డీఎంఎస్టీ నిధులు రూ.28లక్షలతో సీసీ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి వార్డు కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారాంతో పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డులకు ఎమ్మెల్యే నిధులు కేటాయించారని అన్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల అవసరాలను బట్టి అభివృద్ధి పనులు జరగడంతో స్తానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మున్సిపల్ రూపురేఖలు కూడా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, రాము, నర్సింలు, సిద్దు, వెంకట్ రెడ్డి, నరేందర్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/32249/