schedule Thursday, September 03, 2026

నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం

calendar_today November 1, 2021
person dharshininews
నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం
నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం - నోటీసుల‌కు సిద్ద‌మ‌వుతున్న అధికారులు హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలుగు సీనీ హిరో నాగశౌర్యకు చెందిన న‌గ‌ర‌శివారులోని ఫామ్ హౌస్‌లో పేకాట వ్య‌వ‌హరం క‌ల‌క‌లం రేపింది. అక్కడ మినీ క్యానినోను తలపించే రేంజ్‌లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్‌ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. బ్యాన్‌ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్యకు నోటీసులివ్వనున్నారని తెలుస్తోంది. దానికంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. ఒక్క ఈ ఫామ్‌ హౌస్‌లోనే కాదు.. శివారుల్లోని అనేక ఫామ్ హౌస్‌ల్లో ఇదే దందా జరుగుతోంది. నాగ‌శౌర్య‌కు చెందిన ఫామ్‌హౌస్‌ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి పేరు బయటకి వస్తోంది. ఈ బుజ్జి ఎవరో కాదు… నాగశౌర్యకు బాబాయి. అంటే.. ఫామ్‌హౌస్‌ లీజ్ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ పేరు మీద ఉంటే.. ఫామ్‌హౌస్ కార్యకలాపాన్నీ బాబాయి బుజ్జీ చూసుకుంటున్నట్లు సమాచారం. ఈయన పాత్రపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసులో 20మంది ప్రముఖులు పోలీసుల లాకప్‌లో ఉన్నారు. వీళ్లందరికీ కరోనా సహా ఇతర హెల్త్‌ చెకప్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే కోర్టుకు తరలించబోతున్నారు పోలీసులు. అయితే ఆ పేకాట వ్యవహారంతో తనకు ఏం సంబంధం లేదని నాగశౌర్య చెబుతున్నారు. అది తన తండ్రి పేరు మీద ఉందని.. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదంటున్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బ‌య‌టకు వ‌చ్చే అవకాశం ఉంది.