schedule Monday, July 06, 2026

కట్టమైసమ్మ వైభోగం..!

calendar_today January 19, 2025
person dharshininews
కట్టమైసమ్మ వైభోగం..!
కట్టమైసమ్మ వైభోగం..! - ఘనంగా జాతర ఉత్సవాలు - దర్శించుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమల్ - ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ - శోభాయామానంగా అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గుమాస్తానగర్లో వెలసిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వెలసిన శ్రీ కట్టమైసమ్మ తల్లికి అభిషేకం, కుంకుమార్చన, పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ సతీమణి సరితతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. జాతర సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కాలనీ పెద్దలతో కలిసి అమ్మవారిని పల్లకి సేవ ఊరేగింపుగా తీసుకవచ్చారు. ఈ ఊరేగింపు పురవీధుల్లో అమ్మవారి పల్లకి సేవ శోభాయామానంగా కొనసాగింది. మరోవైపు జాతర సందర్భంగా మహిళ భక్తులు అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర ఉత్సవాల్లో బీజేపీ నాయకులు గాజుల శాంతుకుమార్, హిందూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్, చెన్ బసప్ప, కాలనీ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32379/