schedule Monday, July 06, 2026

బంటు మల్లప్పకు ఘన సన్మానం

calendar_today January 19, 2025
person dharshininews
బంటు మల్లప్పకు ఘన సన్మానం
బంటు మల్లప్పకు ఘన సన్మానం - సత్కరించిన ముదిరాజ్ యువజన సంఘం - ఆశీర్వదించిన అయ్యప్ప స్వాములు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్పను ఘనంగా సన్మానించారు. ఆదివారం పట్టణంలోని ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం తరుపున బంటు మల్లప్పను ఘనంగా సన్మానించారు. బంటు మల్లప్ప ఆయన కుమారుడు బంటు మహేష్ ను వైద్య వృత్తిని చదవించి పేదల వైద్యానికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించడం పట్ల గొప్ప మనసును అభినందించారు. బంటు మహేష్ తరుపున సంఘం సభ్యులు బంటు మల్లప్పను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు ఉత్తమ్ చందు, నరేష్ మహరాజ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు అంతారం లలిత, ఎస్పీ రవి కాంత్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సాయిపూర్ లోని తన నివాసాన్ని 55 రోజులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి కేటాయించడంతో పాటు ఎలాంటి లోటు పాటు లేకుండా చూసుకున్నందుకు అయ్యప్ప మాల పూర్తి చేసుకున్న స్వాములు కేశవరెడ్డి, బాకారం జైపాల్ రెడ్డి తదితరులు బంటు మల్లప్పను ఆశీర్వదించి సన్మానించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32386/