schedule Monday, July 06, 2026

వార్డు సభలకు వేళాయే..!

calendar_today January 20, 2025
person dharshininews
వార్డు సభలకు వేళాయే..!
వార్డు సభలకు వేళాయే..! - షెడ్యూల్ ప్రకటించిన మున్సిపల్ అధికారులు - సభల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు - దరఖాస్తు దారులకు మరోచాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోన్న కొత్త పథకాలలో అర్హులను ఎంపిక చేయడంలో భాగంగా వార్డు సభల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ అధికారులు మంగళవారం నుంచి పట్టణంలో నిర్వహిస్తున్న వార్డు సభల షెడ్యూల్‌ను ప్రకటించారు. 21వ తేది నుంచి 24వ తేది వరకు ప్రతి వార్డులో సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3-30 గంటల వరకు సభలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం 1వ వార్డు నుంచి 8వ వార్డుతో పాటు 24, 25వ వార్డు, బుథవారం 9వ వార్డు నుంచి 18వ వార్డు వరకు, 23న 19వ వార్డు నుంచి 23వ వార్డుతో పాటు 26వ వార్డు నుంచి 30వ వార్డు వరకు, 24న 31వ వార్డు నుంచి 36వ వార్డు వరకు వార్డు సభలు జరుగుతాయని వివరించారు. ఈ సభలలో కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోకుండా మిగిలి పోయిన లబ్దిదార్డులు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సభల వద్ద టెంట్లు, ఫ్లెక్సీలతో పాటు మౌళిక సదుపాయాలు, మెడికల్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలను సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32405/