schedule Friday, September 11, 2026

భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..!

calendar_today January 23, 2025
person dharshininews
భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..!
భళా.. బాల సుభాష్ చంద్రబోస్‌లు..! - అనన్య సామన్య పోరాట స్పూర్తిని గుర్తు చేస్తూ ప్రదర్శనలు - కేవీసీఎస్‌లో అట్టహాసంగా నేతాజీ జయంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు బాల సుభాష్ చంద్రబోష్ వేషాధారణలో భళా అనిపించారు. గురువారం స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకులు సుభాస్ చంద్రబోస్ జయంతి వేడుకలను పాఠశాల ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ల ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతాజీ జయంతి సందర్భంగా స్కూల్ విద్యార్థులు నేతాజీ వేషాధారణలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. దేశ స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ సంకల్పంతో ఏవిధంగా ముందుకు సాగారాని ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మార్చ్ ఫాస్ట్ పేరేడ్ తో ఉత్సహాన్ని నింపారు. స్వాతంత్రం కోసం చిరస్మరణీయంగా నిలిచిన నేతాజీ పోరాటాల ప్రదర్శనలు హైలెట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడుగా నిలుస్తారని అభివర్ణించారు. బ్రిటీష్ పాలనను గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డగా నిలిచారని అన్నారు. భారతావని కోసం ఆయన చేసిన పోరాటలు అనన్య సామాన్యమన్నారు. ఆయన స్ఫూర్తి.. సంకల్పంతో అందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ నుంచి పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తా వద్ద ఉన్న నేతా విగ్రహం వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ సోమశేఖర్, పలువరు నాయకుల సమక్షంలో నె తాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32516/